Air India: విశాఖపట్నం - హైదరాబాద్ విమానానికి తప్పిన పెను ప్రమాదం

Air India Flight Avoids Major Accident in Visakhapatnam
  • మధ్యాహ్నం విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరిన విమానం
  • విమానం రెక్కలో పక్షి ఇరుక్కోవడంతో దెబ్బతిన్న ఇంజిన్ ఫ్యాన్ 
  • చాకచక్యంగా విమానాన్ని వెనక్కి తీసుకువచ్చి ల్యాండ్ చేసిన పైలట్
విశాఖపట్నం-హైదరాబాద్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు మధ్యాహ్నం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. విమానం కొంత దూరం ప్రయాణించిన తర్వాత, రెక్కలో పక్షి ఇరుక్కోవడంతో ఇంజిన్ ఫ్యాన్ రోటార్ బ్లేడ్లు దెబ్బతిన్నాయి.

అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా విమానాన్ని వెనక్కి తీసుకువచ్చి సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విశాఖపట్నంలో నిలిచిపోయిన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఎయిరిండియా యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.
Air India
Air India Express
Visakhapatnam
Hyderabad
Flight Emergency Landing
Bird Strike

More Telugu News