IMD: రాబోయే 3 గంటల్లో ఏపీలో వర్షాలు.. ఐఎండీ వార్నింగ్

IMD Warns of Rains in AP in Next 3 Hours
––
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ప్రకాశం, నెల్లూరు, కాకినాడ, కోనసీమ, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉండడంతో వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు.
IMD
Andhra Pradesh Rains
AP Weather
Rain Alert
IMD Warning
Prakasam
Nellore
Kakinada
Konaseema
Rayalaseema

More Telugu News