ECIL: ఈసీఐఎల్ లో ఉద్యోగాలు.. నెలకు రూ.25 వేల వేతనం

Technical Officer Job Openings at ECIL Hyderabad
––
నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) పలు పోస్టుల భర్తీకి తాజాగా నియామక ప్రకటన విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. కనీసం 60 శాతం మార్కులతో బి.టెక్, బీఈ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వచ్చే నెల 10 నుంచి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఈసీఐఎల్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని పేర్కొంది. 

ఖాళీలు: 160 (టెక్నికల్ ఆఫీసర్ సి)‌‌‌
రిజర్వేషన్: అన్ రిజర్వ్డ్ 65, ఈడబ్ల్యూఎస్ 16, ఓబీసీ 43, ఎస్సీ 24, ఎస్టీ 12.  
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బి.టెక్, బీఈలో ఉత్తీర్ణత. 
వయసు: గరిష్ఠంగా 30 ఏళ్లు (రిజర్వేషన్లకు లోబడి సడలింపు)
దరఖాస్తు విధానం: సెప్టెంబర్ 16 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరితేదీ సెప్టెంబర్ 22. 
ఎంపిక ప్రక్రియ: అర్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా
వెయిటేజీ: బి.టెక్, బీఈలో మార్కులకు 20 శాతం, అనుభవానికి 30 శాతం, ఇంటర్వ్యూకు 50 శాతం
జీతం: తొలి ఏడాది నెల నెలా రూ.25 వేలు, రెండో ఏడాది రూ.28 వేలు, మూడో సంవత్సరం నుంచి రూ.31 వేలు
ECIL
ECIL jobs
Electronics Corporation of India
Hyderabad jobs
Technical Officer jobs
B.Tech jobs
BE jobs
Contract jobs
Telangana jobs

More Telugu News