Election Commission of India: ఇకపై కొత్త ఈవీఎం బ్యాలెట్ పేపర్లు.. తొలిసారిగా బీహార్ ఎన్నికల్లో అమలు

Election Commission of India Introduces New EVM Ballot Papers for Bihar Elections
  • ఈవీఎం బ్యాలెట్ పేపర్ల డిజైన్‌లో ఎన్నికల సంఘం మార్పులు
  • రంగుల్లో, పెద్ద సైజులో అభ్యర్థుల ఫోటోలు
  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి కొత్త విధానం అమలు
  • ఓటర్ల సౌకర్యార్థం, గందరగోళాన్ని నివారించేందుకు ఈసీ నిర్ణయం
  • అసెంబ్లీ ఎన్నికలకు పింక్ రంగు పేపర్ వాడకం
  • గత 6 నెలల్లో ఈసీ తెచ్చిన 28 సంస్కరణల్లో ఇదొకటి
దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఓటర్లకు మరింత స్పష్టమైన, సౌకర్యవంతమైన ఓటింగ్ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) బ్యాలెట్ పేపర్ల డిజైన్, ముద్రణలో పలు మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నూతన విధానాన్ని తొలిసారిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ఓటర్ల సౌకర్యమే ప్రధాన లక్ష్యం

ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఇక మీదట ఈవీఎంపై ఉండే బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల ఫోటోలు రంగుల్లో, మరింత పెద్దవిగా కనిపించనున్నాయి. ఫోటో కోసం కేటాయించిన స్థలంలో మూడు వంతుల భాగాన్ని ఆక్రమించేలా వీటిని ముద్రిస్తారు. దీనివల్ల ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థిని సులభంగా గుర్తించేందుకు వీలవుతుంది. అభ్యర్థుల పేర్లను కూడా పెద్ద అక్షరాలతో, ఒకే రకమైన ఫాంట్‌లో ముద్రించడం ద్వారా చదవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దృష్టి సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఈ మార్పులు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

నాణ్యత, స్పష్టతకు పెద్దపీట

బ్యాలెట్ పేపర్ల నాణ్యత విషయంలో కూడా ఈసీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ పేపర్ల కోసం 70 జీఎస్ఎం నాణ్యత కలిగిన కాగితాన్ని ఉపయోగించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేకంగా పింక్ రంగు పేపర్‌ను వాడాలని ఈసీ నిర్దేశించింది. దీనికి నిర్దిష్టమైన ఆర్‌జీబీ విలువలను కూడా కేటాయించింది. అంతేకాకుండా, అభ్యర్థుల సీరియల్ నంబర్లను అంతర్జాతీయ అంకెల రూపంలోనే (1, 2, 3...) ముద్రిస్తారు. ఈ మార్పులన్నీ ఓటింగ్ ప్రక్రియలో స్థిరత్వాన్ని తీసుకురావడంతో పాటు ఓటర్లలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా చేస్తాయని అధికారులు తెలిపారు.

సంస్కరణల్లో భాగంగానే ఈ మార్పులు

ఓటర్ల సౌలభ్యాన్ని పెంచేందుకు, ఎన్నికల ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు గత ఆరు నెలల్లో తాము చేపట్టిన 28 సంస్కరణల్లో ఇదొక భాగమని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది. "ఈ అప్‌గ్రేడెడ్ ఈవీఎం బ్యాలెట్ పేపర్లను బీహార్‌తో ప్రారంభించి, రాబోయే అన్ని ఎన్నికల్లో ఉపయోగిస్తాం" అని ఈసీ వెల్లడించింది. 
Election Commission of India
EVM
electronic voting machine
Bihar elections
ballot paper
election reforms
voter awareness
election process
ECI guidelines

More Telugu News