Thangaraj: మొక్కు తీర్చుకోవడానికి 151 మేకలను బలిచ్చిన లారీ డ్రైవర్
––
అనారోగ్యంతో బాధపడుతుండగా అమ్మవారికి మొక్కుకున్నాడో లారీ డ్రైవర్.. తాను కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారితే మేకలను బలిస్తానని ప్రత్యేక పూజలు చేశాడు. ఇటీవల కోలుకోవడంతో తన మొక్కును తీర్చుకునేందుకు 151 మేకలను బలిచ్చాడు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా అత్తిమరత్తూర్ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ తంగరాజ్ ఈ మొక్కు కోసం రూ. 10 లక్షలు వెచ్చించాడు.
ఆరేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడిన తంగరాజ్.. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నయం కాకపోవడంతో బి.అగ్రహారంలోని ముత్తు మారియమ్మన్ ఆలయానికి వెళ్లి అమ్మవారికి మొక్కుకున్నాడు. తన ఆరోగ్యం కుదుటపడేలా చేయాలని ప్రత్యేక పూజలు చేశాడు. మంగళవారం ఈ మొక్కును తీర్చుకున్నాడు. ముత్తు మారియమ్మన్ ఆలయ ప్రాంగణంలో 151 మేకలను అమ్మవారికి బలిచ్చి, దర్శనానికి వచ్చిన భక్తులకు విందు భోజనం ఏర్పాటు చేశాడు.