Teja Sajja: వంద కోట్లకు చేరిన మిరాయ్ వసూళ్లు

Teja Sajjas Mirai Collects 100 Crores in 5 Days
––
యువ హీరో తేజ సజ్జా సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'మిరాయ్' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. విడుదలైన 5 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా 'మిరాయ్' చిత్రానికి ఐదు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ఆ సినిమా యూనిట్ తెలిపింది. మిరాయ్ తొలిరోజు రూ.27.20 కోట్లు, రెండో రోజు రూ.55.60 కోట్ల వసూళ్లు సాధించింది. వారాంతం కావడంతో ఆదివారం రూ.16 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

తాజాగా ఈ సినిమా వసూళ్లు గ్రాస్ కలెక్షన్ వంద కోట్లకు చేరిందని బుధవారం ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వారం కూడా థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో మిరాయ్ వసూళ్ల జోష్ కొనసాగే అవకాశం ఉంది. వచ్చే వారం పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా రిలీజ్ కానుండడంతో 'మిరాయ్' కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈలోపు 'మిరాయ్' ఎంత కలెక్షన్స్ సాధిస్తుందో చూడాల్సి ఉంది.
Teja Sajja
Mirai movie
Telugu cinema
Box office collections
100 crore club
Super adventure thriller
OG Pawan Kalyan
Telugu film industry
Mirai collections
Movie review

More Telugu News