Karthik Ghattamaneni: 'మిరాయ్' టైటిల్ వెనుక జరిగింది ఇదే: డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని
- రామేశ్వరం వెళుతుండగా వచ్చిన ఆలోచన ఇది
- 'మిరాయ్' అనే సౌండింగ్ నచ్చింది
- తేజ సజ్జాతోనే చేయాలని అనుకున్నాను
- రీసెర్చ్ కి చాల సమయం పట్టింది
- సక్సెస్ అయినందుకు హైపీగా ఉందన్న దర్శకుడు
'మిరాయ్' .. క్రితం శుక్రవారం విడుదలైన సినిమా. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. భారీ వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతోంది. అలాంటి ఈ సినిమా సక్సెస్ ను గురించి 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ప్రస్తావించాడు. "డీవోపీగా నాకు రావలసిన క్రెడిట్ నాకు రావడం లేదే అనే ఉద్దేశంతో నేను డైరెక్టర్ గా మారలేదు. డీఓపీగా నేను చేయలేకపోయిన కథను తెరకెక్కించడం కోసమే నేను ఈ సినిమా చేయడం జరిగింది" అని ఆయన అన్నారు.
"నేను రామేశ్వరం వెళుతున్నప్పుడు నాకు ఈ సినిమాకి సంబంధించిన ఆలోచన వచ్చింది. ఆ సమయంలో నాలో కలిగిన కొన్ని అనుభూతుల నుంచి ఈ ఆలోచన వచ్చింది. ఆ తరువాత నేను ఆ దిశగా పరిశోధన చేస్తూ వెళ్లాను. అప్పుడు అశోకుడి తొమ్మిది పుస్తకాల గురించిన ఒక బుక్ చదివాను. అది నిజమా కదా అనేది నాకు తెలియదు గానీ, ఆ బుక్ నన్ను ప్రభావితం చేసింది. ఆ కథలోని సమస్యను పరిష్కరించడం కోసం రామాయణ కాలంలోకి వెళ్లడం జరిగింది" అని అన్నారు.
"ఈ సినిమా కోసం కొన్ని టైటిల్స్ అనుకున్నాం. అయితే వాటి సౌండింగ్ నాకు నచ్చలేదు. 'మిరాయ్' అనేది జపనీస్ వర్డ్ .. ఫ్యూచర్ అనే అర్థం ఉంది. సౌండింగ్ బాగుందని అనిపించి ఆ టైటిల్ ను సెట్ చేయడం జరిగింది. ఇక నాకు మొదటి నుంచి తేజ సజ్జాతో ఉన్న పరిచయం కారణంగా, ఈ సినిమాను ఆయనతోనే చేయాలని అనుకున్నాను. అలా మొత్తానికి ఒక నాలుగైదేళ్ల తరువాత ఇది కార్యరూపాన్ని దాల్చింది" అని చెప్పారు.