Gadikota Srikanth Reddy: బయటకు సుపరిపాలన, లోపల రెడ్ బుక్ పాలన: గడికోట శ్రీకాంత్ రెడ్డి
- ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఫైర్
- 2047 విజన్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా
- అమరావతిలో పనులు మొదలుపెట్టకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శ
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో 'రెడ్ బుక్ రాజ్యాంగం' నడిపిస్తున్నారని, ఆయన మాటలకు, చేతలకు పొంతన లేదని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. లా అండ్ ఆర్డర్‌పై కఠినంగా ఉంటామని మీడియా ముందు చెబుతున్న చంద్రబాబు, ఆచరణలో మాత్రం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.
చంద్రబాబు 2047 విజన్ అంటూ ప్రజలను మభ్యపెట్టే మాటలు చెబుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. "2020 అన్నారు, ఇప్పుడు 2047 అంటున్నారు. రెండు తరాలు మారితే గానీ 2047 రాదు. మాటలు మార్చడం తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి శూన్యం. హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశానని చెప్పుకుంటారు, కానీ బెంగళూరు అభివృద్ధి గురించి అక్కడి నేతలు ఎప్పుడూ అలా గొప్పలు చెప్పుకోరు. మహానగరాలు కాలక్రమేణా అభివృద్ధి చెందుతాయి" అని ఆయన చురకలంటించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే రూ. 2 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని, నాలుగు లక్షల పెన్షన్లను తొలగించిందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. "ఆరోగ్యశ్రీకి రూ. 2,500 కోట్లు బకాయిలు పెట్టారు. దీంతో ఆసుపత్రుల్లో ఓపీ సేవలు కూడా నిలిచిపోయాయి. పేదలు ఆసుపత్రుల వెలుపల పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదా?" అని ఆయన ప్రశ్నించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చారని, గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజలకు మెరుగైన సేవలు అందించారని గుర్తుచేశారు. "మేం 13 కొత్త జిల్లాలను పారదర్శకంగా ఏర్పాటు చేశాం. పులివెందులలో మెడికల్ కాలేజీ సీట్లను సైతం ఈ ప్రభుత్వం వెనక్కి పంపింది. అభివృద్ధి అంటే జగన్ చేసినట్లు పనుల్లో కనిపించాలి కానీ, మీలా విధ్వంసకర పాలనలో కాదు" అని విమర్శించారు. అమరావతిలో ఇంతవరకు పనులు ప్రారంభించలేదని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై అబద్ధాలు చెప్పి ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కల్లబొల్లి మాటలు మానుకుని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చంద్రబాబుకు హితవు పలికారు.