YS Jagan Mohan Reddy: నేడు తాడేపల్లికి వైఎస్ జగన్ .. సాయంత్రం ముఖ్య నేతలతో భేటీ!

YS Jagan To Reach Tadepalli Today Meeting With Key Leaders
  • ఈ రోజు ఉదయం 11.15 గంటలకు గన్నవరం చేరుకోనున్న జగన్
  • రోడ్డు మార్గంలో బయలుదేరి 12.40 గంటలకు తాడేపల్లి నివాసానికి 
  • ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై వైసీపీ సభ్యులతో సమావేశం
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. ఆయన ఉదయం బెంగళూరులోని తన నివాసం యలహంక నుంచి బయలుదేరి 9.30 గంటలకు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకుంటారు. అక్కడ నుంచి 10.15 గంటలకు విమానంలో బయలుదేరి 11.15 గంటలకు గన్నవరం చేరుకుంటారు. 12.10కి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లి నివాసానికి 12.40 గంటలకు చేరుకుంటారు. 
 
అనంతరం, అందుబాటులో ఉన్న వైసీపీ ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశమవుతారు, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించడంతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శాసనమండలిలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపైనా సూచనలు సలహాలు అందించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 
YS Jagan Mohan Reddy
Tadepalli
YSRCP
Andhra Pradesh Politics
Assembly Sessions
Political Strategy
Gannavaram Airport
TDP Government
Opposition Party

More Telugu News