Usman Wahla: షేక్ హ్యాండ్ వివాదం.. పాక్ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు.. పీసీబీ డైరెక్టర్‌ ఉద్యోగం ఊస్ట్

PCB Director Usman Wahla Fired Over India Pakistan Shake Hand Issue
  • ఆసియా కప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం
  • మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు టీమిండియా నిరాకరణ
  • తీవ్రంగా స్పందించిన పీసీబీ.. డైరెక్టర్‌ ఉస్మాన్ వాహ్లాపై సస్పెన్షన్ వేటు
  • వివాదాన్ని ముందుగానే చక్కదిద్దడంలో విఫలమయ్యారని ఆరోపణ
  • మ్యాచ్ రిఫరీని తొలగించాలని ఐసీసీకి పాక్ బోర్డు డిమాండ్
  • తర్వాతి మ్యాచ్ బహిష్కరిస్తామని పాకిస్థాన్ హెచ్చరిక
ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ‘షేక్ హ్యాండ్’ వివాదం పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో ప్రకంపనలు రేపుతోంది. ఈ వివాదాన్ని ముందుగానే అంచనా వేసి, సరైన రీతిలో స్పందించడంలో విఫలమయ్యారంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఉస్మాన్ వాహ్లాను పీసీబీ సస్పెండ్ చేసింది. 

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన వెంటనే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే మైదానం వీడి నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. పాక్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ కోసం మైదానంలో ఎదురుచూసినప్పటికీ, భారత ఆటగాళ్లు స్పందించలేదు. ఈ ఘటన పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.

ఈ విషయంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అంతర్గత విచారణ జరిపారు. క్రీడాస్ఫూర్తికి సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశాన్ని ఉస్మాన్ వాహ్లా సమర్థంగా నిర్వహించలేకపోయారని విచారణలో తేలినట్లు పాక్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రెండేళ్లుగా ఈ పదవిలో ఉన్న వాహ్లా.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు, ఈ వివాదంపై పీసీబీ భిన్నమైన వాదనను వినిపిస్తోంది. షేక్ హ్యాండ్స్ ఉండవని టాస్ సమయంలోనే ఇరు జట్ల కెప్టెన్లకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చెప్పినట్టు పీసీబీ ఆరోపిస్తోంది. దీనికి నిరసనగా పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా పోస్ట్-మ్యాచ్ ప్రజెంటేషన్‌కు గైర్హాజరయ్యాడు. మ్యాచ్ రిఫరీని తొలగించాలని, తమ డిమాండ్లను నెరవేర్చకపోతే యూఏఈతో జరగబోయే తర్వాతి మ్యాచ్‌ను బహిష్కరిస్తామని కూడా పీసీబీ హెచ్చరించినట్లు సమాచారం. ఒకవేళ పాకిస్థాన్ మ్యాచ్‌ను బహిష్కరిస్తే, టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.
Usman Wahla
Pakistan Cricket Board
PCB
India Pakistan match
Asia Cup 2024
shake hand controversy
Mohsin Naqvi
Salman Agha
Andy Pycroft
cricket

More Telugu News