Rajasthan: ఫేస్‌బుక్ ప్రేమ.. ప్రియుడిని వెతుక్కుంటూ 600 కి.మీ కారు డ్రైవ్‌ చేసి వెళ్లి.. అతడి చేతిలోనే హత్య

Woman Travels 600km for Lover Gets Murdered in Rajasthan
  • ఫేస్‌బుక్‌లో పరిచయమైన టీచర్‌తో అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌కు ప్రేమ
  • ప్రియుడిని కలిసేందుకు 600 కిలోమీటర్లు ప్రయాణించిన మహిళ
  • పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై తీవ్ర ఒత్తిడి
  • కారులో బయటకు తీసుకెళ్లి ఐరన్ రాడ్డుతో దాడి
  • రాజస్థాన్‌లోని బర్మార్‌లో ఘ‌ట‌న‌
ప్రేమించిన వ్యక్తి కోసం 600 కిలోమీటర్లు కారు నడుపుకుంటూ వెళ్లిన ఓ మహిళ, చివరకు అతడి చేతిలోనే అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. ఫేస్‌బుక్‌లో మొదలైన వారి పరిచయం, పెళ్లి ప్రస్తావనతో విషాదాంతంగా ముగిసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని బర్మార్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఝున్‌ఝునుకు చెందిన ముకేశ్‌ కుమారి (37) అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో బర్మార్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మనరామ్‌తో ఆమెకు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇప్పటికే వివాహితుడైన మనరామ్‌, తన భార్యతో మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టులో కేసు నడుపుతున్నాడు.

కొంతకాలానికి వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ముకేశ్‌ కుమారి గత కొంతకాలంగా మనరామ్‌పై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 10న, మనరామ్‌ను కలిసేందుకు ఆమె తన కారులో ఝున్‌ఝును నుంచి బర్మార్‌కు బయలుదేరింది. నేరుగా అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో తన ప్రేమ వ్యవహారాన్ని చెప్పింది.

అదే రోజు సాయంత్రం, మాట్లాడదామని చెప్పి ముకేశ్‌ను మనరామ్‌ కారులో బయటకు తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో పెళ్లి విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన మనరామ్‌, కారులో ఉన్న ఇనుప రాడ్డుతో ఆమె తలపై బలంగా కొట్టడంతో ముకేశ్‌ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Rajasthan
Mukesh Kumari
Rajasthan crime
Facebook love affair
murder
Barmer
Manaram
extra marital affair
love marriage
crime news
police investigation

More Telugu News