Smoking woman in train: రైల్లో ఏసీ కంపార్ట్ మెంట్ లో దమ్ముకొట్టిన మహిళ... మీకేంటి నొప్పి అంటూ తోటి ప్రయాణికులపై ఎదురుదాడి!

Smoking Woman in Train Argues With Passengers on Visakhapatnam to GandhiDham Express
  • ఏసీ రైలు కోచ్‌లో ఓ మహిళ సిగరెట్ తాగుతూ హల్‌చల్
  • విశాఖపట్నం-గాంధీధామ్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకున్న ఘటన
  • అభ్యంతరం చెప్పిన తోటి ప్రయాణికులతో తీవ్ర వాగ్వాదం
  • నా డబ్బులతో తాగుతున్నా, మీకేంటి నొప్పంటూ ఎదురుదాడి
  • పోలీసులను పిలుచుకోండంటూ సవాల్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
రైలు ఏసీ కోచ్‌లో ఓ మహిళ ప్రయాణికులందరూ చూస్తుండగానే దర్జాగా సిగరెట్ తాగుతూ రచ్చ చేసింది. ఇదేంటని ప్రశ్నించిన తోటి ప్రయాణికులపై ఎదురుదాడికి దిగింది. "నా డబ్బులతో నేను సిగరెట్ తాగుతున్నా, మీకేంటి నొప్పి? ఇదేమీ మీ సొంత రైలు కాదు కదా?" అంటూ తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే, ఈ సంఘటన విశాఖపట్నం నుంచి గాంధీధామ్ వెళుతున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ లో జరిగినట్లు తెలుస్తోంది. ఏసీ కోచ్‌లో ఉన్న ఓ మహిళ సిగరెట్ వెలిగించి పొగ వదలడం మొదలుపెట్టింది. దీంతో ఇబ్బందిపడిన ఓ ప్రయాణికుడు, "ఏం చేస్తున్నారు? ఇది ఏసీ కోచ్ అని కనిపించడం లేదా? లోపల సిగరెట్ ఎందుకు తాగుతున్నారు?" అని ప్రశ్నించారు.

అదే సమయంలో మరో ప్రయాణికుడు ఈ తతంగాన్ని వీడియో తీయడం గమనించిన ఆ మహిళ మరింత ఆగ్రహానికి గురైంది. "ఎందుకు నా వీడియో తీస్తున్నావ్? వెంటనే డిలీట్ చెయ్" అని గట్టిగా అరిచింది. అందుకు ఆ ప్రయాణికుడు నిరాకరించడంతో, "మీకేంటి? ఇదేమీ మీ రైలు కాదు కదా. నా డబ్బులతోనే సిగరెట్ తాగుతున్నా" అంటూ ఎదురు సమాధానం ఇచ్చింది.

బయటకు వెళ్లి తాగమని ప్రయాణికులు సూచించగా, ముందు తన వీడియో డిలీట్ చేయాలని ఆమె షరతు పెట్టింది. "ఈ రైలు మీదా? నేను బయటకు వెళ్లనని చెప్పానా? లేదు కదా. మరి వీడియో ఎందుకు డిలీట్ చేయడం లేదు?" అని వాదించింది. దానికి ఆ ప్రయాణికుడు, "అసలు విషయం అది కాదు, ముందు మీరు లోపల ఎందుకు సిగరెట్ తాగుతున్నారు?" అని మళ్లీ ప్రశ్నించాడు. దీంతో ఆమె తన కింది బెర్త్‌పై కూర్చుని, "వెళ్లి పోలీసులను పిలుచుకోండి" అంటూ సవాల్ విసిరింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
Smoking woman in train
Visakhapatnam GandhiDham Superfast Express
Train AC coach smoking
Viral video train incident
Indian Railways smoking ban
Public smoking controversy
Train passenger argument
Smoking in public transport
విశాఖపట్నం గాంధీధామ్ ఎ

More Telugu News