Suresh Gopi: వృద్ధుడి దరఖాస్తును తిరస్కరించిన సురేశ్ గోపి.. విమర్శలపై ఏం చెప్పారంటే?

Suresh Gopi Responds to Criticism on Rejecting Old Mans Application
  • నెరవేర్చలేని హామీలు ఇవ్వనని సురేశ్ గోపి వివరణ
  • ఆశలు కల్పించి మోసం చేయనని సురేశ్ గోపి స్పష్టీకరణ
  • ఇల్లు కట్టించడం రాష్ట్ర ప్రభుత్వ పని అని సమాధానం
  • గృహ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని వెల్లడి
తాను నెరవేర్చలేని హామీలు ఇచ్చి ప్రజలకు తప్పుడు ఆశలు కల్పించనని కేంద్ర మంత్రి సురేశ్ గోపి స్పష్టం చేశారు. కేరళలోని తన నియోజకవర్గంలో ఒక వృద్ధుడి నుంచి దరఖాస్తు స్వీకరించేందుకు నిరాకరించారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విమర్శలపై ఆయన సోమవారం ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చారు.

అసలేం జరిగింది?

సెప్టెంబర్ 12న త్రిసూర్‌లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో వేలాయుధన్ అనే వృద్ధుడు తనకు ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ సురేశ్ గోపికి దరఖాస్తు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, మంత్రి దాన్ని బహిరంగంగా స్వీకరించడానికి నిరాకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, ఆయన తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం

ఈ విమర్శలపై సురేశ్ గోపి స్పదించారు "ప్రజా ప్రతినిధిగా నేను ఏం చేయగలనో, ఏం చేయలేనో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. గృహ నిర్మాణం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పరిగణనలోకి తీసుకోవాలి. తప్పుడు హామీలు ఇవ్వడం నా పద్ధతి కాదు" అని తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. కొందరు ఈ ఘటనను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

తాను వ్యవస్థకు లోబడి మాత్రమే ప్రజలకు నిజమైన ప్రయోజనాలు అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. "గత రెండేళ్లుగా నేను ఆ కుటుంబ పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఈ ఘటన తర్వాత మరో పార్టీ వారికి సురక్షితమైన ఇల్లు అందించేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉంది. దాని వెనుక రాజకీయ ఉద్దేశం ఉన్నప్పటికీ, ఆ కుటుంబానికి ఇల్లు దొరకడమే ముఖ్యం" అని సురేశ్ గోపి అన్నారు. తన చర్య కారణంగానే వారికి ఇప్పుడు సహాయం అందిందని, దీనిని తాను సానుకూల పరిణామంగానే చూస్తున్నానని తెలిపారు. ప్రజల కష్టాల్లో రాజకీయ క్రీడలకు తావులేదని, వాస్తవ పరిష్కారాలే ముఖ్యమని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
Suresh Gopi
Kerala
Thrissur
housing scheme
old man application
social media criticism
state government

More Telugu News