Benjamin Netanyahu: ఖతార్ విషయంలో జాగ్రత్త.. నెతన్యాహుకు ట్రంప్ వార్నింగ్

Donald Trump Warns Netanyahu on Qatar Relations
  • దోహాపై వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్
  • తమకు సమాచారం ఇచ్చిందన్న అమెరికా
  • ట్రంప్ తీరును తప్పుబట్టిన ఖతార్ పాలకులు
  • ఖతార్ తమకు ముఖ్యమైన మిత్రదేశమంటూ ట్రంప్ దిద్దుబాటు చర్యలు
ఖతార్ తమకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశమని, ఆ దేశం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును హెచ్చరించారు. ఇటీవల దోహాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. గతవారం ఖతార్ రాజధాని దోహాలోని ఓ హోటల్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.

ఆ హోటల్ లో హమాస్ నేతలు సమావేశమయ్యారని, వారిని మట్టుబెట్టేందుకే ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ విషయంపై తమ మిత్రదేశం అమెరికాకు ముందే సమాచారం ఇచ్చామని నెతన్యాహు తెలిపారు. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. దాడి చేస్తున్న విషయం తమకు ముందే తెలుసని, ఈ విషయం ఖతార్ కు కూడా తెలియజేశామని చెప్పారు.

అయితే, ఇజ్రాయెల్ వైమానిక దాడి ప్రారంభమైన తర్వాతే అమెరికా ప్రభుత్వ యంత్రాంగం నుంచి తమకు సమాచారం అందిందని ఖతార్ పాలకులు తెలిపారు. అమెరికా తీరును వారు ఆక్షేపించారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన ట్రంప్.. తాజాగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఖతార్‌ ఎమిర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీని అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. ఖతార్ తమకు ముఖ్యమైన మిత్రదేశమని, ఆ దేశం విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నెతన్యాహును హెచ్చరించారు.
Benjamin Netanyahu
Qatar
Donald Trump
Israel
Doha
Hamas
US relations
Sheikh Tamim bin Hamad Al Thani

More Telugu News