Asia Cup 2024: ఆసియాకప్‌ మ్యాచ్‌లో పాక్ జాతీయ గీతానికి బదులు 'జిలేబీ బేబీ' పాట.. అవాక్కైన ఆటగాళ్లు!

Asia Cup 2024 Jalebi Baby Played Instead of Pakistan National Anthem
  • ఇండియా-పాక్ మ్యాచ్‌కు ముందు ఊహించని ఘటన
  • ఆశ్చర్యపోయిన పాక్ ఆటగాళ్లు, అభిమానులు
  • తప్పును సరిదిద్దుకుని అసలు గీతాన్ని ప్లే చేసిన నిర్వాహకులు
ఆసియా కప్‌లో భాగంగా గత రాత్రి భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు ఒక ఇబ్బందికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ జాతీయ గీతాన్ని ప్లే చేయాల్సిన సమయంలో, స్టేడియంలోని లౌడ్ స్పీకర్ల నుంచి ప్రముఖ పాప్ సాంగ్ 'జిలేబీ బేబీ' వినిపించింది. దీంతో ఆటగాళ్లు, అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

జాతీయ గీతం కోసం చాతీపై చేతులు పెట్టుకుని సిద్ధంగా ఉన్న పాక్ ఆటగాళ్లు.. ఈ ఊహించని పరిణామంతో తీవ్ర అసహనానికి, ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తమ తప్పును గ్రహించిన నిర్వాహకులు ఆ పాటను ఆపివేసి, పాకిస్థాన్ జాతీయ గీతమైన 'పాక్ సర్జమీన్ షాద్ బాద్'ను ప్లే చేశారు. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది.

క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా జాతీయ గీతాల విషయంలో పొరపాట్లు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా లాహోర్‌లో పొరపాటున భారత జాతీయ గీతాన్ని ప్లే చేయడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇబ్బంది పడింది. అలాగే, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మ్యాచ్‌లో ఆసీస్ జాతీయ గీతానికి బదులుగా 'జన గణ మన'ను ప్లే చేసిన ఘటన కూడా ఉంది. 
Asia Cup 2024
India vs Pakistan
Pakistan National Anthem
Jalebi Baby Song
Cricket Match Error
Asia Cup
Cricket
India
Pakistan

More Telugu News