Employee: 'సార్ లీవ్ కావాలి'.. మెసేజ్ పెట్టిన 10 నిమిషాలకే ఉద్యోగి మృతి

Employee Dies of Heart Attack After Asking for Leave
  • వెన్నునొప్పితో ఆఫీస్‌కు రాలేనంటూ అధికారికి ఉద్యోగి సందేశం
  • ఉదయం 8:37 గంటలకు సెలవు కోరిన 40 ఏళ్ల శంకర్
  • సరిగ్గా 10 నిమిషాలకే గుండెపోటుతో హఠాన్మరణం
  • విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పైఅధికారి అయ్యర్
  • జీవితం ఎంత అనూహ్యమో అంటూ సోషల్ మీడియాలో ఆవేదన
జీవితం ఎంత అనూహ్యమైనదో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమీ ఘటన. "సార్, నాకు సెలవు కావాలి" అని తన పైఅధికారికి సందేశం పంపిన ఓ ఉద్యోగి, సరిగ్గా పది నిమిషాల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ హృదయ విదారక సంఘటన ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. శంకర్ (40) అనే ఉద్యోగి తన పైఅధికారి అయిన కేవీ అయ్యర్‌కు ఉదయం 8:37 గంటలకు ఒక మెసేజ్ పంపారు. "సార్, తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాను. ఈరోజు ఆఫీస్‌కు రాలేను. దయచేసి సెలవు మంజూరు చేయండి" అని అందులో కోరారు. ఇది సాధారణంగా వచ్చేదే కావడంతో అయ్యర్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఆ సందేశం పంపిన పది నిమిషాలకే, అంటే ఉదయం 8:47 గంటలకు శంకర్ గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు.

ఈ విషాద వార్త ఉదయం 11 గంటల సమయంలో అయ్యర్‌కు తెలిసింది. తన సహోద్యోగి ఇక లేరని తెలిసి ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉదయం తనతో మాట్లాడిన వ్యక్తి కొద్దిసేపటికే మరణించాడన్న వార్తను ఆయన జీర్ణించుకోలేకపోయారు.

ఈ విషయాన్ని అయ్యర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. "ధూమపానం, మద్యపానం వంటి ఎలాంటి చెడు అలవాట్లు లేని శంకర్ ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం నమ్మలేకపోతున్నాను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం అసాధ్యం" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
Employee
Shankar
employee death
heart attack
leave request
KV Iyer
sudden demise
social media post
viral news
work life balance
health awareness

More Telugu News