Konda Surekha: ఏదో అదృష్టం వల్ల ఎమ్మెల్యే అయ్యారు: సొంత పార్టీ ఎమ్మెల్యేకు కొండా సురేఖ కౌంటర్

Konda Surekha Counters Own Party MLA Lucky to be Elected
  • మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని మధ్య ముదురుతున్న విభేదాలు
  • నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టంతోనే ఎమ్మెల్యే అయ్యారన్న కొండా సురేఖ
  • ఇద్దరు సభ్యులను నియమించే అధికారం కూడా లేదా అని సురేఖ ప్రశ్న
  • రాజకీయంగా నాయిని తనకంటే చిన్నవాడని వ్యాఖ్య
వరంగల్ జిల్లా రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. నాయిని రాజేందర్ రెడ్డి కేవలం అదృష్టం వల్లే ఎమ్మెల్యేగా గెలిచారని, రాజకీయంగా తన కంటే చాలా చిన్నవాడని కొండా సురేఖ వ్యాఖ్యానించారు.

కొంతకాలంగా ఇద్దరు నేతల మధ్య అంతర్గతంగా కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం తాజాగా ధర్మకర్తల నియామకం విషయంలో తారస్థాయికి చేరింది. ఈ అంశంపై నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన కొండా సురేఖ, ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక మంత్రిగా తనకు కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "ఒకరిద్దరు ధర్మకర్తలను నియమించుకునే అధికారం కూడా నాకు లేదా?" అని ప్రశ్నించారు. భద్రకాళి ధర్మకర్తల అంశం చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని ఆమె అన్నారు. తాను చైర్మన్‌ను కూడా నియమించలేదని, కేవలం ఇద్దరు ధర్మకర్తలను మాత్రమే నియమించామని అన్నారు. ఆ ఇధ్దరిని కూడా తన వారికి మాత్రమే ఇవ్వలేదని అన్నారు.
Konda Surekha
Naini Rajender Reddy
Warangal Politics
Telangana Politics
MLA
Minister Konda Surekha

More Telugu News