Revanth Reddy: కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ వాయిదా

Congress Kamareddy BC Declaration Meeting Postponed
  • ఈ నెల 15న బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించాలని నిర్ణయించిన కాంగ్రెస్
  • పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఉండటంతో సభ వాయిదా
  • అధికారికంగా ప్రకటించిన టీపీసీసీ
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ వాయిదా పడింది. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభను నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సభను వాయిదా వేస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది.

ఈ సభను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరు కావాల్సి ఉంది. ఎన్నికలకు ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకురానున్నట్లు తెలిపింది.
Revanth Reddy
Kamareddy
BC Declaration
Congress Party
Telangana Elections
Rain Alert
Mallikarjun Kharge

More Telugu News