Hydra Ranganath: మ్యాన్ హోల్‌లో పడిపోయిన చిన్నారి ఘటనపై హైడ్రా కమిషనర్ రియాక్షన్
- ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టినట్లు వెల్లడి
- సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని వివరణ
- మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్‌ఛార్జి బాధ్యుడన్న రంగనాథ్
హైదరాబాద్ లోని యాకుత్‌పురలో ఓ చిన్నారి మ్యాన్ హోల్ లో పడిపోయిన సంగతి తెలిసిందే. వెనకే వస్తున్న తల్లి వేగంగా స్పందించడంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఈ ఘటనపై హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పందించారు. మ్యాన్ హోల్ మూత తెరిచి ఉంచడమే ప్రమాదానికి కారణమని, దీనికి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టామని తెలిపారు. మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్‌ఛార్జి ఈ ఘటనకు బాధ్యుడని చెప్పారు.
మ్యాన్ హోల్ లో పడిన చిన్నారి..
యాకుత్‌పుర పరిధి రెయిన్‌బజార్ డివిజన్ లోని మౌలాకా ఛిల్లా బస్తీలో గురువారం ఆరేళ్ల చిన్నారి మ్యాన్ హోల్ లో పడిపోయింది. బుధవారం మధ్యాహ్నం పూడికతీత పనుల కోసం మ్యాన్ హోల్ తెరిచిన బల్దియా సిబ్బంది.. ఆ తర్వాత మూసేయకుండానే వెళ్లిపోయారని స్థానిక బల్దియా సహాయ ఇంజినీరు నరేశ్ తెలిపారు. గురువారం ఉదయం స్కూలుకు వెళుతున్న ఓ చిన్నారి ఈ మ్యాన్ హోల్ లో పడిపోయింది. ఆమె తల్లి, స్థానికులు చిన్నారిని గుంతలో నుంచి పైకి లాగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.