Karishma Sharma: ఆసుపత్రిలో చేరిన రాగిణి ఎంఎంఎస్ నటి
- ముంబై లోకల్ రైలులో నుంచి దూకడంతో గాయాలు
- స్నేహితురాళ్లతో కలిసి షూటింగ్ కు వెళుతుండగా ప్రమాదం
- తలకు గాయం కావడంతో అబ్జర్వేషన్ లో ఉంచిన వైద్యులు
ముంబై లోకల్ రైలులో నుంచి దూకడంతో రాగిణి ఎంఎంఎస్ నటి కరిష్మా శర్మకు గాయాలయ్యాయి. వీపు, తలకు గాయలయ్యాయని, వెంటనే ఆసుపత్రికి తరలించామని ఆమె స్నేహితురాళ్లు తెలిపారు. ప్రస్తుతం కరిష్మాను వైద్యులు అబ్జర్వేషన్ లో ఉంచారని పేర్కొన్నారు. ఓ సినిమా షూటింగ్ కు వెళ్లేందుకు ముంబై లోకల్ రైలులో బయలుదేరగా.. కరిష్మా ముందే రైలు ఎక్కిందని, తాము మాత్రం ఎక్కలేకపోయామని ఆమె స్నేహితురాళ్లు చెప్పారు.
దీంతో ఆందోళన చెందిన కరిష్మా.. కదులుతున్న రైలులో నుంచి దూకేసిందని వివరించారు. కరిష్మా వీపుతో పాటు శరీరమంతా చిన్న చిన్న గాయాలయ్యాయని, తలకు దెబ్బ తగలడంతో వైద్యులు ఎంఆర్ఐ చేశారని తెలిపారు. ఈ ప్రమాదంపై కరిష్మా ఇన్ స్టాలో స్పందిస్తూ.. ప్రస్తుతం తాను ఆసుపత్రిలో ఉన్నానని, తాను త్వరగా కోలుకోవాలంటే మీ అందరి ప్రేమాభిమానాలు కావాలని పోస్ట్ పెట్టారు.