Kallakurichi murder: ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భార్య... ఇద్దరినీ తలలు నరికి చంపిన భర్త

Husband beheads wife and lover
  • తమిళనాడు కళ్లకురిచిలో జంట హత్యలు
  • భార్యను ప్రియుడితో చూసి సహించలేకపోయిన భర్త
  • ఇద్దరి తలలను కిరాతకంగా నరికేసిన భర్త
  • మొండెంలను మేడపై వదిలేసి, తలలతో పోలీస్ స్టేషన్‌కు
  • నిందితుడిని చూసి షాక్ అయిన పోలీసులు
తమిళనాడులోని కళ్లకురిచిలో అత్యంత దారుణమైన, భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇద్దరి తలలను చేతుల్లో పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు రావడంతో అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి కారణమని విచారణలో తేలింది.

వివరాల్లోకి వెళితే, స్థానికంగా నివసించే ఓ వ్యక్తి తన భార్యను ఇంట్లో ఆమె ప్రియుడితో కలిసి ఉండగా చూశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతను, వారిద్దరిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పదునైన ఆయుధంతో ఇద్దరి తలలను నరికేశాడు. అనంతరం మొండెంలను ఇంటి టెర్రస్‌పై పడేసి, వారి తలలను తీసుకుని నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

చేతుల్లో రెండు తలలతో స్టేషన్‌లోకి అడుగుపెట్టిన నిందితుడిని చూసి పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, అతని చేతిలోని తలలను, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు అతని ఇంటికి చేరుకున్నారు. అక్కడ టెర్రస్‌పై తలలు లేని రెండు మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు.

ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఈ జంట హత్యల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Kallakurichi murder
Tamil Nadu crime
Extra marital affair
Double murder
Crime news
Husband kills wife
Infidelity murder
Lovers murder
Head chopped off

More Telugu News