Chandrababu Naidu: రేపు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం... ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu to Attend Vice President Oath Ceremony in Delhi
  • హస్తినకు పయనమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 
  • ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబుకు ఆహ్వానం 
  • ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా హాజరు
  • కార్యక్రమం తర్వాత తిరిగి అమరావతికి పయనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రేపు నూతన ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హస్తినకు బయలుదేరారు. గురువారం సాయంత్రం 6:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు.

శుక్రవారం ఢిల్లీలో భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందిన ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన తిరిగి అమరావతికి బయలుదేరతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Chandrababu Naidu
Andhra Pradesh
Vice President
CV Ananda Bose
Delhi
Oath Ceremony
NDA
India
Political News

More Telugu News