Hyderabad Rains: హైదరాబాద్ శివారులో కుండపోత వర్షం

Hyderabad Suburbs Hit by Torrential Rain
  • ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు కుండపోత వర్షం
  • రోడ్ల మీద నీరు నిలవడంతో వాహనదారుల ఇబ్బందులు
  • మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొద్ది నిమిషాల్లోనే రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మొదలైన ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో మూడున్నర గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ పట్టణంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Hyderabad Rains
Hyderabad weather
Telangana rains
Heavy rainfall Hyderabad
LB Nagar
Vanastalipuram

More Telugu News