Vangalapudi Anitha: నేపాల్ నుంచి ఏపీ ప్రజలు ఈ సాయంత్రానికి రాష్ట్రానికి చేరుకుంటారు: హోంమంత్రి అనిత

AP People to Return from Nepal by Evening Says Minister Anitha
  • నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపునకు చర్యలు
  • సాయంత్రానికల్లా రాష్ట్రానికి చేరుకోనున్న బాధితులు
  • సచివాలయంలో మంత్రులు లోకేశ్, దుర్గేశ్ సమీక్ష
  • నాలుగు విమానాశ్రయాల్లో ప్రజాప్రతినిధులతో స్వాగతం
  • స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు
  • వివరాలు వెల్లడించిన హోంమంత్రి వంగలపూడి అనిత
నేపాల్ లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. వారంతా ఈరోజు సాయంత్రానికల్లా రాష్ట్రానికి క్షేమంగా చేరుకోనున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తూ, వారిని సొంత గూటికి చేర్చేందుకు నిరంతరాయంగా పనిచేస్తోందని ఆమె స్పష్టం చేశారు.

"నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసులను రాష్ట్రానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిరాటంకంగా కృషి చేస్తోంది. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ లో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడం జరిగింది. సాయంత్రంలోగా నేపాల్ నుంచి ఏపీ ప్రజలు అందరూ సురక్షితంగా రాష్ట్రానికి చేరుకుంటారు. నేపాల్ నుంచి వచ్చే వారికి విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, కడప ఎయిర్ పోర్టులలో ప్రజాప్రతినిధులు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు చేర్చే ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది" అని అనిత వివరించారు. 
Vangalapudi Anitha
Nepal
Andhra Pradesh
AP People in Nepal
Nara Lokesh
Kandula Durgesh
AP Government
Rescue Operation
Repatriation
RTGS Center

More Telugu News