Danam Nagender: జూబ్లీహిల్స్ నుంచి తాను పోటీ చేస్తాననే ప్రచారంపై స్పందించిన దానం నాగేందర్

Danam Nagender Responds to Jubilee Hills Contest Rumors
  • తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే
  • టిక్కెట్ ఎవరికి కేటాయించినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడి
  • కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందన్న నాగేందర్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. తాను అక్కడి నుంచి పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. అవన్నీ కేవలం ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు. టిక్కెట్ ఎవరికి కేటాయించినా పార్టీ గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.

ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ముఖ్యమని దానం అభిప్రాయపడ్డారు. ఆదర్శ్ నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంలోనే పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.
Danam Nagender
Jubilee Hills
Khairatabad MLA
Telangana Elections
Congress Party
Assembly Elections

More Telugu News