Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు అనారోగ్యం
- 'సూపర్ సిక్స్... సూపర్ హిట్' కార్యక్రమానికి హాజరుకాని బాలకృష్ణ
- అనారోగ్యం కారణంగా బాలయ్య రాలేదని వెల్లడించిన పయ్యావుల కేశవ్
- అనారోగ్యం వివరాలను వెల్లడించని కేశవ్
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి పయ్యవుల కేశవ్ వెల్లడించారు. అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న 'సూపర్ సిక్స్... సూపర్ హిట్' సభలో పయ్యావులు మాట్లాడుతూ... ఈ సభకు నారా లోకేశ్, బాలకృష్ణ ఇద్దరూ హాజరుకావాల్సి ఉందని ఆయన చెప్పారు. అనారోగ్యం కారణంగా బాలయ్య ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని తెలిపారు. అయితే, బాలయ్యకు ఏమైంది? అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు, నేపాల్ లో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా రప్పించే పనుల్లో లోకేశ్ నిమగ్నమై ఉన్నారని... సచివాలయం నుంచి నేపాల్ లోని పరిస్థితిని ఆయన మానిటర్ చేస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా ఈ కార్యక్రమానికి లోకేశ్ హాజరుకాలేకపోయారని చెప్పారు.