Nirmala Sitharaman: జీఎస్టీ పరిధిలోకి మద్యం.. నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?

Nirmala Sitharaman on Bringing Alcohol Under GST
  • రాష్ట్రాల పరిధిలో మద్యంపై పన్ను
  • తయారీపై ఎక్సైజ్ సుంకం, అమ్మకాలపై వ్యాట్ విధింపు
  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదాయ వనరు
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే చర్చ చాలాకాలంగా జరుగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు చేపట్టి శ్లాబులను కుదించిన విషయం తెలిసిందే. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి మధ్యతరగతి జీవులకు ఊరట లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రమంలోనే మద్యంను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ పై మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ఆ విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమేనని స్పష్టం చేశారు. మద్యాన్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చాలా వద్దా అనే విషయంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో తాను స్పందించేందుకు ఏమీలేదని తేల్చిచెప్పారు.

ప్రస్తుత చట్టాల ప్రకారం.. మద్యం తయారీ, అమ్మకాలపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకే ఉంది. మద్యం తయారీపై ఎక్సైజ్ సుంకం విధించడం, మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే మద్యం తయారీ, అమ్మకం ప్రభుత్వాలకు కీలక ఆదాయ వనరుగా మారింది. ఈ నేపథ్యంలో మద్యంను జీఎస్టీ పరిధిలోకి చేర్చితే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆదాయానికి భారీగా గండిపడుతుంది. అందుకే ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి.
Nirmala Sitharaman
GST
Goods and Services Tax
Alcohol
Liquor
State governments
Central government
Tax revenue
Excise duty
VAT

More Telugu News