Mahindra Thar: నిమ్మకాయ తొక్కించాలని ప్రయత్నిస్తే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డ కొత్త కారు.. వీడియో ఇదిగో!

Mahindra Thar falls from first floor during lemon crushing ritual in Delhi
  • ఢిల్లీలోని మహీంద్రా షోరూంలో ప్రమాదం
  • స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళ
  • తీవ్రంగా దెబ్బతిన్న థార్ కారు
కొత్త కారు కొనుగోలు చేసిన ఓ మహిళ షోరూంలో పూజ చేసింది. టైర్ కింద నిమ్మకాయ పెట్టి తొక్కించే ప్రయత్నంలో యాక్సిలేటర్ గట్టిగా అదమడంతో కారు కాస్తా ఫస్ట్ ఫ్లోర్ నుంచి రోడ్డుపై పడింది. ఢిల్లీలోని మహీంద్రా షోరూంలో జరిగిన ఈ ప్రమాదంలో కారు కొనుగోలు చేసిన మహిళతో పాటు షోరూం సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. కొత్త థార్ వాహనం తీవ్రంగా దెబ్బతింది.

వివరాల్లోకి వెళితే..
ఘజియాబాద్ కు చెందిన మాణి పవార్ రూ.27 లక్షలు వెచ్చించి కొత్త థార్ వాహనం కొనుగోలు చేసింది. డెలివరీ తీసుకోవడానికి భర్త ప్రదీప్ తో కలిసి ఢిల్లీ నిర్మాణ్ విహార్ లోని మహీంద్రా షోరూంకు వెళ్లింది. కారును రోడ్డెక్కించే ముందు పూజ చేసి నిమ్మకాయ తొక్కించేందుకు ప్రయత్నించింది. డ్రైవింగ్ సీటులో కూర్చున్న మాణి పవార్ పొరపాటున యాక్సిలేటర్ ను గట్టిగా అదిమింది. దీంతో షోరూం అద్దాలను ఢీ కొట్టిన థార్.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మాణి పవార్ తో పాటు మరొకరు గాయపడగా.. ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం వారిని డిశ్చార్జ్ చేశారు. కాగా, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Mahindra Thar
Mahindra
Thar
Car accident
Delhi
Nirman Vihar
Ghaziabad
Car Pooja

More Telugu News