Nara Lokesh: కేంద్రమంత్రి కుమారుడికి నారా లోకేశ్ ఆశీస్సులు

Nara Lokesh Blesses Union Ministers Son
  • ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లిన మంత్రి నారా లోకేశ్
  • రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతుల చిన్నారిని ముద్దాడిన నారా లోకేశ్

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ నిన్న కేంద్ర పౌర విమానయాన  శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. ఇటీవల రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు జన్మించిన బాబును ఆశీర్వదించేందుకు లోకేష్ వారి ఇంటికి వెళ్లారు. చిన్నారిని ఎత్తుకొని ముద్దాడి, తన ఆశీస్సులు అందజేశారు.

ఈ సందర్భంగా అక్కడే ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి బండారు మాధవీలతను క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. 
Nara Lokesh
Kinjarapu Rammohan Naidu
Andhra Pradesh
AP IT Minister
Delhi
Bandaru Satyanarayana Murthy
Blessings
Infant
Political News

More Telugu News