Benjamin Netanyahu: ఎక్కడ ఉన్నా హమాస్ నేతలను వదిలేది లేదంటున్న ఇజ్రాయెల్

Israel vows to hunt Hamas leaders anywhere
  • హమాస్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టడమే ధ్యేయంగా ఇజ్రాయెల్‌ దాడులు
  • దేశ రాజధాని దోహాలో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు
  • హమాస్ అగ్రనేతలే లక్ష్యంగా స్వతంత్ర ఆపరేషన్‌ చేపట్టామన్న ప్రధాని నెతన్యాహు
హమాస్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టడమే ధ్యేయంగా ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే హమాస్‌ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఖతార్‌లో సైతం దాడి నిర్వహించడం గమనార్హం. ఈ దాడితో ఆ దేశ రాజధాని దోహాలో పెద్దఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అయితే, ఈ దాడి ఎలా జరిగింది? ఎంతమంది మరణించారు? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వైమానిక దళం ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి కల్నల్ అవిచాయ్ అడ్రాయీ పేర్కొన్నారు.

ఈ దాడిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధ్రువీకరించారు. "హమాస్ అగ్రనేతలే లక్ష్యంగా స్వతంత్ర ఆపరేషన్ చేపట్టాం. మేమే దీన్ని నిర్వహించాం. పూర్తి బాధ్యత కూడా తీసుకుంటున్నాం" అని ఆయన 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. మరోవైపు, తమ దేశంలోని హమాస్ పొలిటికల్‌ హెడ్‌క్వార్టర్స్‌పై జరిగిన దాడిని ఖతార్ ఖండించింది. ఇది పిరికిపంద చర్య అని పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించిందని ఖతార్ విదేశాంగశాఖ ప్రతినిధి మజీద్ అల్-అన్సారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ సైతం ఇజ్రాయెల్ చర్యలను తప్పుపట్టారు. 
Benjamin Netanyahu
Hamas
Israel
Qatar
Doha
Gaza
Middle East Conflict
Military Operation
António Guterres
Majid Al-Ansari

More Telugu News