భారత నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు అభినందనలు: నారా లోకేశ్
- భారత నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక
- రాధాకృష్ణన్ అనుభవాన్ని, పాలనాదక్షతను కొనియాడిన లోకేశ్
- ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత దేశానికి ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్య
- ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్ష
ప్రజాసేవలో సీపీ రాధాకృష్ణన్‌కు ఉన్న అపారమైన అనుభవం, ఆయన రాజనీతిజ్ఞత దేశానికి ఎంతగానో మేలు చేస్తాయని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత ఎంతో గొప్పదని ప్రశంసించారు. ఆయన తన పదవీకాలంలో వివేకం, గౌరవంతో ప్రజలకు విజయవంతంగా సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు లోకేశ్ తన సందేశంలో పేర్కొన్నారు. రాధాకృష్ణన్ నాయకత్వంలో దేశం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.