Gold price: హడలెత్తిస్తున్న గోల్డ్... ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు

Gold Price Soars to Record Highs in Hyderabad and Delhi
  • లక్షా 10 వేలు దాటిన 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్
  • 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర రూ. 1,01,100 
  • కిలో వెండి ధర రూ. 1,40,000కు చేరిక
బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరాయి. పసిడి ప్రియులకు భారీ షాక్ ఇస్తూ, ధరలు ఆకాశాన్నంటాయి. మంగళవారం ఒక్కరోజే భారీగా పెరిగి, తులం (10 గ్రాములు) స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ. 1,10,000 మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. వెండి ధరలు కూడా అదే దారిలో పయనిస్తూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులంపై రూ. 1,360 పెరిగింది. దీంతో దాని ధర రూ. 1,10,290కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులంపై రూ. 1,250 పెరిగి, రూ. 1,01,100 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

బంగారంతో పాటే వెండి ధరలు కూడా భగ్గుమన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండిపై ఒక్కరోజే రూ. 3,000 పెరగడంతో, దాని ధర రూ. 1,40,000 వద్దకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 1,10,440 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,01,250 వద్ద అమ్ముడవుతోంది. అయితే, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,30,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడంతో, బంగారం కొనాలనుకునే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
Gold price
Gold rate
Silver price
Hyderabad bullion market
Vijayawada
Visakhapatnam
Delhi gold price
24 Carat gold
22 Carat gold
Gold investment

More Telugu News