Prajwal Revanna: మాజీ ప్రధాని మనవడు జైలులో ఏం పనిచేస్తున్నాడో తెలుసా..?

Prajwal Revanna JDS Leader Works as Library Clerk in Jail
  • అత్యాచారం కేసులో జైలుపాలైన దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ
  • లైబ్రరీలో క్లర్క్ గా విధులు అప్పగించిన జైలర్
  • రోజుకు రూ.522 చొప్పున చెల్లిస్తామని అధికారుల వెల్లడి
మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ మనవడు, జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. పనిమనిషి, ఆమె కూతురుపైనా అత్యాచారం చేసిన కేసులో ప్రజ్వల్ రేవణ్ణ జైలుపాలయ్యారు. ఈ కేసులో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం రేవణ్ణ కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు శిక్ష పడిన వారికి అధికారులు వివిధ పనులు అప్పగిస్తారు. విద్యార్హతలను బట్టి పనులు చేయిస్తారు. ఇందుకు నిర్ణీత మొత్తం చెల్లిస్తారు.

ఆ సొమ్మును ఖైదీ ఖాతాలో జమ చేస్తారు. విడుదలై బయటకు వెళ్లే సమయంలోనో లేక తమను చూడడానికి వచ్చే కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకో ఖైదీలు తమ ఖాతాలోని సొమ్మును తీసుకోవచ్చు. ప్రస్తుతం రేవణ్ణకూ జీవిత ఖైదు విధించడంతో నిబంధనల ప్రకారం జైలు అధికారులు ఆయనకు లైబ్రరీ విధులు అప్పగించినట్లు సమాచారం. లైబ్రరీలో క్లర్కుగా రేవణ్ణ పనిచేస్తున్నారు. ఇందుకు ఆయనకు రోజుకు రూ.522 చొప్పున వేతనం చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Prajwal Revanna
HD Deve Gowda
Karnataka
Parappana Agrahara Jail
JDS
Sexual Assault Case
Jail Labor
Library Clerk

More Telugu News