Nara Lokesh: కోయంబత్తూరు పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్ భేటీ

Nara Lokesh Meets Coimbatore Industrialists
  • కోయంబత్తూరులో పర్యటించిన మంత్రి నారా లోకేశ్
  • స్థానిక పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశం
  • ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానం
  • పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతుల హామీ
  • లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్
  • డీపీఆర్‌తో వస్తే చాలు.. మిగతా బాధ్యత ప్రభుత్వానిదేనని వెల్లడి
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కోయంబత్తూరు చేరుకున్నారు. కోయంబత్తూరు ఎయిర్ పోర్టులో తమిళనాడు బీజేపీ నేత అమర్ ప్రసాద్ రెడ్డి, అక్కడి తెలుగు ప్రజలు మంత్రి లోకేశ్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం కోయంబత్తూరులోని పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉందని తెలిపారు. పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. 

"పరిశ్రమదారులు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతో రాష్ట్రానికి వచ్చాక నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత మాదే. రాష్ట్రంలో పెద్దఎత్తున వాయు, జల, రోడ్డు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ఆంధ్రపదేశ్ లాజిస్టిక్ హబ్ గా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న పరిశ్రమ అనుకూల విధానాల వల్ల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టండి" అంటూ మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.
Nara Lokesh
Andhra Pradesh
Coimbatore
Tamil Nadu BJP
Investments
Industrialists
Chandrababu Naidu
Logistics Hub
AP Industries

More Telugu News