Hyderabad car accident: మద్యం మత్తులో పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన కారు

Hyderabad Car Accident Kills Woman Injures Several
  • ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం.. యువతి మృతి
  • పోలీసులు సహా మరో ఇద్దరికి గాయాలు
  • వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా ప్రమాదం
హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు కారు నడుపుతూ ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. పోలీసులు సహా మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక నిమజ్జనం సందర్భంగా లంగర్‌హౌస్‌ దర్గా సమీపంలో పోలీసులు ట్రాఫిక్ విధుల్లో నిమగ్నమయ్యారు.

ఈ క్రమంలో వేగంగా దూసుకు వచ్చిన ఓ కారు పోలీసుల వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఆ కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ఈ ప్రమాదంలో కశ్వి (20) అనే యువతి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు వాహనంలో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
Hyderabad car accident
Langer House
drunk driving
car crash
police vehicle
Vinyaka Nimajjanam
road accident
Hyderabad traffic police

More Telugu News