YS Jagan: వైసీపీ‌లో కొత్త నియామకాలు

YS Jagan Announces New Appointments in YSRCP
  • వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించిన వైసీపీ
  • ఐదు జోన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించిన వైఎస్ జగన్
  • ఆక్వా కల్చర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురామ్ నియామకం
వైసీపీలో వివిధ పదవుల భర్తీలో భాగంగా పలువురు నేతలకు పదవులు కట్టబెట్టింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర రైతు విభాగంలో వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

జోన్ 1 (శ్రీకాకుళం) రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గొంటు రఘురామ్, జోన్ 2 (తూర్పు గోదావరి) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బూరుగుపల్లి సుబ్బారావు, జోన్ 3 (కృష్ణాజిల్లా) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సింహాద్రి రమేశ్ బాబు, జోన్ 4 (ప్రకాశం) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎనుముల మారుతి ప్రసాద్ రెడ్డి, జోన్ 5 (కర్నూలు) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వంగల భరత్ కుమార్ రెడ్డి, మరియు అక్వా కల్చర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురామ్ (పశ్చిమ గోదావరి) నియమితులయ్యారు. 
YS Jagan
YSR Congress Party
YSRCP
రైతు విభాగం
Rythu Vibhagam
Gontu Raghuram
Boorugupalli Subbarao
Simhadri Ramesh Babu
Vanga Bharath Kumar Reddy
AP Politics

More Telugu News