Revanth Reddy: 'జై బోలో రేవంత్ రెడ్డికి అనకండి'!: నిమజ్జనం కార్యక్రమంలో రేవంత్ రెడ్డి సూచన.. ఇదిగో వీడియో

Revanth Reddy suggests no Jai Bolo for him during Nimajjanam
  • నెక్లస్ రోడ్డు వద్ద 'భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి' వేదిక వద్ద రేవంత్ రెడ్డి
  • తనకు జై కొట్టడంపై అభ్యంతరం తెలిపిన ముఖ్యమంత్రి
  • 'జై బోలో గణేశ్ మహరాజుకీ.. జై'  అనాలని సూచన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెక్లస్ రోడ్డు వద్ద 'భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి' వేదిక నుంచి భక్తులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యుడు ఒకరు 'జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై' అని నినదించారు. అనంతరం 'జై బోలో సీఎం రేవంత్ రెడ్డి గారికి జై' అన్నారు.

అయితే, దేవుడితో పాటు తనకూ 'జై బోలో' అని అనడం పట్ల రేవంత్ రెడ్డి సంజ్ల ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవుడి వద్ద 'జై బోలో రేవంత్ రెడ్డి' అనవద్దని సూచించారు. దీంతో సదరు వ్యక్తి సర్దుకుని తిరిగి 'జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై' అని నినదించారు.
Revanth Reddy
Telangana
Ganesh Utsav Samiti
Bhagyanagar Ganesh Utsav Samiti
Necklace Road

More Telugu News