Jitender: ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.. రేపటి వరకు నిమజ్జనాలు: డీజీపీ జితేందర్

Jitender Khairatabad Ganesh Immersion Concludes Peacefully
  • వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్న డీజీపీ
  • రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు లేకుండా ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడి
  • బాలాపూర్ గణపతి నిమజ్జనం నాలుగు గంటల లోపు పూర్తవుతుందన్న డీజీపీ
ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, అయితే వినాయక నిమజ్జనాలు రేపటి వరకు కొనసాగనున్నాయని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆయన మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన అన్నారు. నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బలగాలు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలాపూర్ గణపతి శోభాయాత్ర ప్రారంభమైందని, నాలుగు గంటల లోపు నిమజ్జనం పూర్తవుతుందని వెల్లడించారు.

నిమజ్జనాలు రేపటి వరకు కొనసాగుతాయని తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీ కంట్రోల్ రూమ్ నుంచి వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈసారి ఎస్డీఆర్ఎఫ్ కూడా నిమజ్జన విధుల్లో పాల్గొన్నదని తెలిపారు.
Jitender
Khairatabad Ganesh
Ganesh Nimajjanam
Hyderabad
Telangana DGP
Balapur Ganesh

More Telugu News