Mithun Reddy: లిక్కర్ స్కామ్ కేసు... మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు.. జైలు నుంచి విడుదల

Mithun Reddy Granted Interim Bail in Liquor Scam Case
  • మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో స్వల్ప ఊరట
  • ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు
  • ఈనెల 11న తిరిగి సరెండర్ కావాలని కోర్టు ఆదేశం
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వియవాడ ఏసీబీ కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ సభ్యుడినైన తాను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉందని.. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 
Mithun Reddy
AP Liquor Scam
Liquor Scam Case
ACB Court
Vijayawada
Interim Bail
Vice President Election
YSRCP MP

More Telugu News