కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో కవలలకు జన్మనిచ్చిన యువతి
- శ్రీకాకుళం స్టేషన్లో ఘటన
- ఇచ్చాపురంకు చెందిన గర్బిణికి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులోనే డెలివరీ చేసిన వైద్యురాలు
- రైల్వే అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన భూలక్ష్మి దంపతులు
రైలును శ్రీకాకుళం స్టేషన్ వద్ద నిలిపివేయగా, ఆర్పీఎఫ్ సిబ్బంది సమాచారంతో అప్పటికే అక్కడికి చేరుకున్న వైద్యురాలు డాక్టర్ పల్లవి కీర్తి గర్భిణి భూలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రైలులోనే సురక్షితంగా ప్రసవం జరిపారు. ఈ సందర్భంగా భూలక్ష్మి ఇద్దరు ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిచ్చింది.
అనంతరం, తల్లి, పిల్లలను మెరుగైన వైద్యం కోసం రాగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన ఆర్పీఎఫ్ సిబ్బందికి, వైద్యురాలు డాక్టర్ పల్లవి కీర్తికి, రైల్వే సిబ్బందికి భూలక్ష్మి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.