Gorantla Butchaiah Choudary: అందుకు సజ్జల కూడా బాధ్యత వహించాలి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah Choudary demands Sajjalas accountability
  • సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల తీవ్ర విమర్శలు
  • ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత సజ్జలకు లేదన్న గోరంట్ల
  • జగన్‌తో పాటు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక
  • వైసీపీ హయాంలో భారీగా దోపిడీ జరిగిందని ఆరోపణ
  • వారి అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తామని స్పష్టీకరణ
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు జైలుకు వెళ్లేందుకు సజ్జల కూడా సిద్ధంగా ఉండాలని ఆయన ఘాటుగా హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో గోరంట్ల ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత సజ్జలకు ఎక్కడిదని గోరంట్ల ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన భారీ దోపిడీకి, అవినీతికి సజ్జల కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. "ధైర్యం ఉంటే మీ పార్టీ ఎమ్మెల్యేలను బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి" అంటూ సజ్జలకు ఆయన సవాల్ విసిరారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు తాము భయపడబోమని, వారి బెదిరింపులు తమ దగ్గర పనిచేయవని స్పష్టం చేశారు.

గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని గోరంట్ల ఆరోపించారు. కనీసం రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలను కూడా చెల్లించలేని దుస్థితిలో గత ప్రభుత్వం ఉండేదని విమర్శించారు. వైసీపీ నేతలు చేసిన అవినీతి, దోపిడీకి సంబంధించిన ప్రతి అంశాన్ని తమ ప్రభుత్వం వెలికితీస్తుందని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. 
Gorantla Butchaiah Choudary
Sajjala Ramakrishna Reddy
TDP
YCP
Andhra Pradesh Politics
Corruption Allegations
Jagan Mohan Reddy
Telugu Desam Party
YS Jagan
Political Criticism

More Telugu News