Joel Davis: గణేష్ నిమజ్జనం ఛాలెంజింగ్ అంశం: హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ

Joel Davis on Ganesh Nimajjanam Challenge for Hyderabad Traffic Police
  • నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ చాలా కీలకమన్న జోయల్ డేవిస్
  • నెల రోజుల ముందు నుంచి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి
  • అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని వెల్లడి
గణేశ్ నిమజ్జనం పోలీసులకు సవాలుతో కూడుకున్నదని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు. నిమజ్జనం ఏర్పాట్లపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ అత్యంత కీలకమని అన్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల ముందు నుంచి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఆర్ అండ్ బీ, సమాచార శాఖ, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, రవాణా, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని ఆయన వివరించారు. రేపు ఉదయం ఆరు గంటలకు ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం రెండు గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు.

నిమజ్జనం కార్యక్రమంలో సుమారు 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. 3,200 మంది పోలీసులు రెండు షిఫ్టులలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. నిమజ్జనంలో పాల్గొనే భక్తులు ప్రజారవాణా సదుపాయాలను ఎక్కువగా ఉపయోగించుకోవాలని సూచంచారు.
Joel Davis
Hyderabad Traffic
Ganesh Nimajjanam
Ganesh Immersion
Khairatabad Ganesh
Hyderabad

More Telugu News