Ram Gopal Varma: 'టీచర్స్ డే' సందర్భంగా వెరైటీగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varmas Unique Response to Teachers Day
  • టీచర్స్ డే రోజున వర్మ ఆసక్తికర పోస్ట్
  • టీచర్లు తనకు ఏమీ నేర్పలేదంటూ వ్యాఖ్య
  • గ్యాంగ్‌స్టర్లు, దెయ్యాల నుంచే నేర్చుకున్నానన్న ఆర్జీవీ
  • చివరకు చాట్‌జీపీటీ కూడా పాఠాలు చెప్పిందని వెల్లడి
ఆసక్తికర భావ వ్యక్తీకరణకుకు మారుపేరైన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. పవిత్రంగా భావించే ఉపాధ్యాయ దినోత్సవం రోజున, ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన జీవితంలో పాఠాలు నేర్పింది ఉపాధ్యాయులు కాదని వ్యాఖ్యానించారు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. "నా జీవితంలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్లు, రాజకీయ నాయకులతో పాటు దెయ్యాలు, చాట్‌జీపీటీ కూడా ఎన్నో విషయాలు నేర్పాయి. కానీ నా స్కూల్, కాలేజీ టీచర్లు మాత్రం నాకు ఏమీ నేర్పలేదు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.


Ram Gopal Varma
Teachers Day
Ram Gopal Varma tweet
RGV
Controversial tweets
Bollywood director
Social media post
Gangs
Politics
Chat GPT

More Telugu News