Donald Trump: భారత్, రష్యాలను చైనాకు కోల్పోయాం: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Trump Says US Lost India Russia to China
  • ట్రూత్ సోషల్ లో ట్రంప్ ఆసక్తికర పోస్ట్
  • ఇండియా, రష్యా, చైనాలు సుదీర్ఘకాలం వర్ధిల్లాలని వ్యంగ్యం
  • మూడు దేశాల అధినేతల ఫొటోను షేర్ చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, రష్యాలను అమెరికా పూర్తిగా కోల్పోయిందని, ఆ దేశాలు ఇప్పుడు 'చీకటి చైనా'కు దగ్గరయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు.

"మనం భారత్, రష్యాలను చీకటి చైనాకు కోల్పోయినట్టు కనిపిస్తోంది. ఆ మూడు దేశాలు కలిసికట్టుగా సుదీర్ఘకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నా" అంటూ ట్రంప్ తన పోస్ట్‌లో వ్యంగ్యంగా రాసుకొచ్చారు.

ఈ వారం ప్రారంభంలో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆతిథ్యం ఇచ్చారు. ఈ ముగ్గురు నేతలు ఇంధనం, భద్రత వంటి పలు కీలక రంగాల్లో సహకారంపై చర్చించారు. ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అంశాల్లో ఈ మూడు దేశాలు అమెరికాతో విభేదిస్తున్న విషయం తెలిసిందే.

ఢిల్లీ, మాస్కో, బీజింగ్‌ల మధ్య బలపడుతున్న బంధాన్ని ట్రంప్ ఇంత బహిరంగంగా అంగీకరించడం ఇదే తొలిసారి. దశాబ్దాలుగా చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికి భారత్‌ను ఒక వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికా చూస్తోంది. రిపబ్లికన్లు, డెమొక్రాట్లు అనే తేడా లేకుండా అన్ని అమెరికా ప్రభుత్వాలు న్యూఢిల్లీతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చాయి. ట్రంప్ రెందోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన నిర్ణయాలతో పరిస్థితి సమూలంగా మారిపోయింది. సుంకాల మీద సుంకాలు విధిస్తుండడంతో ఇరుదేశాల మధ్య ఎడం పెరిగిపోయింది.
Donald Trump
India Russia China
Trump India comments
China SCO summit
Narendra Modi
Vladimir Putin
Xi Jinping
US foreign policy

More Telugu News