Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన మంత్రి రామానాయుడు దంపతులు

Minister Ramanaidu Invites Pawan Kalyan to Daughter Sreejas Wedding
  • మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ తో నిమ్మల భేటీ
  • ఈ నెల 24న జరగనున్న కుమార్తె శ్రీజ వివాహానికి ఆహ్వానం
  • పవన్ కు స్వయంగా పెళ్లి పత్రికను అందజేసిన మంత్రి
  • భేటీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న నిమ్మల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె వివాహానికి హాజరు కావాలంటూ పవన్ ను స్వయంగా ఆహ్వానించారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో మంత్రి నిమ్మల సతీసమేతంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా, ఈ నెల 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరగనున్న తన కుమార్తె శ్రీజ వివాహ వేడుకకు రావాలని కోరుతూ పవన్ కల్యాణ్ కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ భేటీ ఎంతో ఆత్మీయంగా సాగింది.

ఈ విషయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పవన్ కల్యాణ్ ను తన కుమార్తె పెళ్లికి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
Pawan Kalyan
Nimmala Ramanaidu
Andhra Pradesh
Deputy CM
Minister
Marriage Invitation
Palakollu
West Godavari
Sreeja Marriage

More Telugu News