KCR: ఫామ్ హౌస్ లో కేసీఆర్ హోమం

KCR Performing Homam at Farmhouse
  • గణపతి హోమం నిర్వహిస్తున్న కేసీఆర్
  • భార్యతో కలిసి హోమంలో పాల్గొననున్న బీఆర్ఎస్ అధినేత
  • గత ఐదు రోజులుగా ఫామ్ హౌస్ లోనే కేటీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువనే విషయం తెలిసిందే. హోమాలపై ఆయనకు ఎంతో నమ్మకం. ఇప్పటికే ఆయన ఎన్నో సార్లు పలు రకాల హోమాలను నిర్వహించారు. తాజాగా మరో హోమం నిర్వహించేందుకు ఆయన సిద్ధమయ్యారు. 

ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గణపతి హోమం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు హోమం ప్రారంభమవుతుంది. తన భార్య శోభతో కలిసి కేసీఆర్ హోమంలో పాల్గొననున్నారు. విఘ్నాలు తొలగాలని ప్రార్థస్తూ కేసీఆర్ హోమం నిర్వహించనున్నారు. 

మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత ఐదు రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. హోమానికి కొద్ది మంది నేతలను మాత్రమే ఆహ్వానించారు.
KCR
KCR homam
KCR farm house
Errvalli
Ganapathi Homam
Telangana news
BRS party
KTR
Shobha KCR
Political news

More Telugu News