డొనాల్డ్ ట్రంప్ తీరుపై పుతిన్ ఫైర్.. ఇంకా ఏ కాలంలో ఉన్నారంటూ విమర్శ
- ఇండియా, చైనాలపై భారీగా సుంకాలు విధించడం సరికాదని వ్యాఖ్య
- భాగస్వాములతో ప్రవర్తించే తీరు ఇది కాదంటూ మండిపాటు
- వలసవాద కాలం నాటి పద్ధతులు ఇప్పుడు పనిచేయవంటూ ఎద్దేవా
వలసవాద కాలానికి, ఇప్పటికి ప్రపంచం మారిపోయిందని గుర్తించాలంటూ ట్రంప్ కు హితవు పలికారు. భారత్, చైనాలపై సుంకాలు విధించడం సరికాదన్నారు. భాగస్వామ్య దేశాలతో ఇలా ప్రవర్తించకూడదన్నారు. రెండు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితి తలెత్తిన సందర్భాల్లో ఒక దేశాధినేత బలహీనంగా కనిపించారంటే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుందని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిస్పందిస్తారని పుతిన్ వివరించారు. భాగస్వామ్య దేశాలతో సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి, పరిష్కారం కనుగొనాలే తప్ప పన్నులతో శిక్షిస్తానంటే కుదరదని పుతిన్ స్పష్టం చేశారు.