Donald Trump: రష్యాకు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
- యుద్ధం ఆపకుంటే మరిన్ని ఆంక్షలు తప్పవని హెచ్చరిక
- పుతిన్ నిర్ణయం మాకు అసంతృప్తి కలిగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవన్న ట్రంప్
- ఏం జరగనుందో వేచి చూడాలంటూ మీడియాతో అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపేయాలని ఇప్పటికే హెచ్చరించిన ట్రంప్.. తాజాగా మరోమారు యుద్ధంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ విషయంలో పుతిన్ కు ఇక తాను చెప్పేదేమీ లేదన్నారు. యుద్ధంపై రష్యా తీసుకునే నిర్ణయం అమెరికాకు అసంతృప్తి కలిగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. పుతిన్ నిర్ణయాన్ని బట్టి రష్యాతో ఎలా వ్యవహరించాలో డిసైడ్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. యుద్ధంపై సరైన నిర్ణయం తీసుకోకుంటే మరిన్ని ఆంక్షలు విధిస్తామని తేల్చిచెప్పారు. ఏం జరుగుతుందో వేచి చూడాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.