Reliance Jio: 50 కోట్ల యూజర్ల మార్కు దాటిన జియో.. బంపర్ ఆఫర్లు ప్రకటన

Reliance Jio Celebrates 500 Million Users With Bumper Offers
  • రూ.349 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లలతో ఉన్న వినియోగదారులకు 5 జీ డేటా ఉచితం
  • ఉచితంగా జియో హోం సేవలు
  • రూ.349 ప్లాన్ ను 12 నెలలు తీసుకుంటే అదనంగా నెల ఉచితం
దేశంలో అగ్రగామి టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తన తొమ్మిదవ వార్షికోత్సవాన్ని (సెప్టెంబర్ 5) పురస్కరించుకొని వినియోగదారులకు అనేక బంపర్ ఆఫర్లు ప్రకటించింది. తమ యూజర్ల సంఖ్య 50 కోట్ల మార్కును అధిగమించిందని ప్రకటించిన జియో.. ఈ మైలురాయిని పురస్కరించుకుంటూ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది.
 
అపరిమిత డేటా – నెలపాటు ఉచితం

సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 వరకు రూ.349 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లతో ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ డేటాను ఉచితంగా అందించనుంది. ఇది ప్రీపెయిడ్, పోస్ట్‌ పెయిడ్ వినియోగదారులందరికీ వర్తించనుంది.
 
వార్షికోత్సవ వీకెండ్‌ ఆఫర్

సెప్టెంబర్ 5 నుంచి 7వరకు (శుక్రవారం, శనివారం, ఆదివారం) ప్రత్యేక వీకెండ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
5జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు: ప్రస్తుత ప్లాన్‌కు సంబంధం లేకుండా అపరిమిత 5జీ డేటా ఉచితం.
4జీ యూజర్లకు: రూ.39తో ప్రత్యేక రీచార్జ్ చేసి రోజుకు గరిష్ఠంగా 3జీబీ 4జీ డేటా పొందవచ్చు.
 
జియో హోం సేవలు – ఉచితంగా

రిలయన్స్ జియో మరో కీలక ప్రకటనగా, తమ జియో హోం సేవలను రెండు నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. దీనివల్ల వినియోగదారులు ఇంటి నుంచే హై-స్పీడ్ కనెక్టివిటీని అనుభవించవచ్చు. 

349 ప్లాన్‌ను 12 నెలలు తీసుకుంటే అదనంగా నెల ఉచితం
 
రూ.349 ప్లాన్‌ను వరుసగా 12 నెలలు రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు అదనంగా ఒక నెల ఉచిత సేవలు కూడా అందించనున్నట్లు జియో వెల్లడించింది.
 
ఈ సందర్భంగా జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ..“జియో 9వ వార్షికోత్సవం సందర్భంగా, దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది వినియోగదారులు మాపై ఉంచిన విశ్వాసం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో జియో భాగమైందనే విషయంలో ఈ మైలురాయి ప్రతిబింబిస్తుంది. ప్రతి యూజర్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా,” అని పేర్కొన్నారు.
Reliance Jio
Jio anniversary
Jio offers
Akash Ambani
Jio 5G data
Jio free data
Jio recharge plans
Jio users
Jio home services
Telecom offers India

More Telugu News