Chandrababu Naidu: వైసీపీ విషవృక్షం.. ఫేక్ పార్టీ: చంద్రబాబు

Chandrababu slams YSRCP calls it a fake party
  • నేరాలను నమ్ముకున్న పార్టీ వైసీపీ అని చంద్రబాబు విమర్శ
  • రాష్ట్రంలో యూరియాకు కొరత లేదని వెల్లడి
  • రైతుల ముసుగులో రాజకీయాలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరిక
వైసీపీపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని, నేరాలను నమ్ముకుని కేవలం విషప్రచారంతోనే మనుగడ సాగిస్తోందని ధ్వజమెత్తారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఎన్నో ప్రభుత్వాలను, ఎందరో నాయకులను చూశానని, కానీ ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం అబద్ధాలు ప్రచారం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని, నేరాలను నమ్ముకున్న పార్టీ అని, అందుకే ఆ పార్టీని తాను 'విషవృక్షం' అని పిలుస్తానని స్పష్టం చేశారు.

ఈ ఏడాది పంట పొలాల్లో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వినియోగాన్ని 33 లక్షల మెట్రిక్ టన్నులకు పరిమితం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. రాష్ట్రంలో యూరియాకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాల వారీగా 94,892 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, మార్క్‌ఫెడ్ వద్ద మరో 81,750 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది రెండు పంటలు సాగు చేయడం వల్ల నెల్లూరు జిల్లా రైతులు యూరియాను అత్యధికంగా వినియోగించారని ఆయన పేర్కొన్నారు. 

రైతుల ముసుగులో వైసీపీ శ్రేణులు రాజకీయాలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ఫేక్ పార్టీ అని... ఫేక్ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. 
Chandrababu Naidu
YSRCP
YCP fake party
Andhra Pradesh politics
AP CM
Fake news
Pesticide use
Yuria availability
Nellore farmers
Fertilizer subsidy

More Telugu News